
జనరల్

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్ 2026) ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఇన్ సర్వీస్ టీచర్లలో 51 శాతం మంది, రెగ్యులర్ అభ్యర్థుల్లో 47 శాతం మంది టెట్‌లో ఉత్తీర్ణత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థులకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. పరీక్షలో విజయం సాధించలేకపోయిన వారు నిరుత్సాహపడకుండా మరోసారి ప్రయత్నించాలని సూచించారు.
ఏపీ టెట్ 2026 ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అభ్యర్థులు చూసుకోవచ్చు. ఇందుకోసం AP TET Results Portalలో ఫలితాలను పరిశీలించవచ్చు. అలాగే 9552300009 నంబర్‌కు వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే అవకాశం కల్పించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!