
క్రీడలు

ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు చరిత్ర సృష్టించారు. దేశంలోనే తొలిసారిగా ఒకే రోగికి ఒకేసారి ఐదు అవయవాలను విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. కడుపు, డ్యూడినమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, పెద్దపేగు వంటి అవయవాలను మల్టీ-విసెరల్ ట్రాన్స్‌ప్లాంట్ ద్వారా మార్పిడి చేశారు.
సుమారు 36 గంటల పాటు నిరంతరాయంగా జరిగిన ఈ అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజినీర్‌పై విజయవంతంగా నిర్వహించారు. ఈ ఘనతపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్య బృందాన్ని అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!