

టాలీవుడ్లో సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ కథలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. కొత్త ప్రపంచాలు, విభిన్నమైన కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు స్టార్ హీరోలు, అగ్ర దర్శకులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో శర్వానంద్, నాగ్అశ్విన్, ఎస్.ఎస్. రాజమౌళి, అల్లు అర్జున్, చిరంజీవి చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. ఇప్పటికే శర్వానంద్ ఒకే ఒక్క జీవితం సినిమాతో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇప్పుడు శ్రీను వైట్లతో కలిసి మరో సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. దీంతో ఈ తరహా కథలకు టాలీవుడ్లో మరింత ఆదరణ లభిస్తోంది.
నాగ్అశ్విన్ కల్కి సీక్వెల్లో సైన్స్, మైథాలజీని మరింత విస్తృతంగా చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ కాంబినేషన్లో రూపొందుతున్న వారణాసి ప్రస్తుత కాలం నుంచి రామాయణ కాలానికి ప్రయాణించే కథతో తెరకెక్కుతోంది. మరోవైపు అల్లు అర్జున్ రాకా, చిరంజీవి విశ్వంభర కూడా సరికొత్త ఫ్యాంటసీ ప్రపంచాలను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నాయి. గతంలో ఆదిత్య 369లాంటి సినిమాలు వేసిన పునాదులు ఇప్పుడు మరింత విస్తరిస్తున్నాయి. భారీ సాంకేతికత, కొత్త కాన్సెప్ట్‌లు, ఊహకు అందని ప్రపంచాలతో వస్తున్న ఈ చిత్రాలపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!