
సినిమాలు

నాగార్జునసాగర్ బ్యాలెన్సింగ్ జలాశయ నిర్మాణ సమయంలో ముంపునకు గురైన తండాల నుంచి నాలుగు కుటుంబాలు ఎడ్లబండ్లపై ప్రయాణించి కొత్త నివాస స్థలాన్ని వెతుక్కుని తెల్లవారేసరికి ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నారు. అదే ప్రదేశం కాలక్రమంలో ‘తెల్దేవరపల్లి’గా మారింది. ప్రస్తుతం నల్గొండ జిల్లా చందంపేట మండలంలో ఉన్న ఈ గ్రామం అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోంది.
దాదాపు 25 ఏళ్లపాటు రోడ్డు, విద్యుత్ సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న గ్రామం 1984 తర్వాత విద్య, మౌలిక వసతులతో మారిపోయింది. ప్రస్తుతం 4 వేల జనాభా ఉన్న ఈ గ్రామం నుంచి అనేక మంది ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉన్నత స్థాయిల్లో పనిచేస్తున్నారు. గ్రామ స్థాపకులైన హంజ్య, గన్సింగ్ విగ్రహాలను గ్రామస్థులు ఏర్పాటు చేయనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!