

మెగా హీరో వరుణ్ తేజ్ రెండేళ్ల విరామం తర్వాత ‘కొరియన్ కనకరాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ ఇండో-కొరియన్ హారర్ కామెడీ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించగా, సత్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆగస్టు 7న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా గురించి వరుణ్ తేజ్ మాట్లాడుతూ, తాను కావాలనే గ్యాప్ తీసుకోలేదని, తనకు నచ్చిన కథ కోసం వేచి చూసినట్లు తెలిపారు. గాంధీ చెప్పిన కథ వినూత్నంగా, వినోదాత్మకంగా అనిపించడంతో ఈ ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నట్లు వెల్లడించారు.
తన పాత్ర ‘కనకరాజు’ గురించి మాట్లాడుతూ, అది తన వ్యక్తిత్వానికి పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పారు. అనంతపురం-రాయలసీమ యాసలో మాట్లాడటంతో పాటు కొరియన్ భాష నేర్చుకుని డైలాగ్స్ చెప్పడం పెద్ద సవాలుగా మారిందని వివరించారు. ఉచ్చారణ, టైమింగ్, భావోద్వేగాలను సమన్వయం చేయడం కష్టంగా అనిపించినప్పటికీ, ఈ పాత్రను చేయడం ఎంతో సరదాగా అనిపించిందన్నారు. హారర్, కామెడీ, యాక్షన్ మేళవింపుతో ఈ సినిమా కొత్త కాన్సెప్ట్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!