
సినిమాలు

అమెరికాతో శాంతి ఒప్పందాన్ని ఇరాన్ అధికారికంగా ధ్రువీకరించింది. ఈ విషయాన్ని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాదీ వెల్లడించారు. జూన్ 19న ఇరు దేశాలు ఒప్పందంపై సంతకాలు చేస్తాయని ఆయన తెలిపారు. ఒప్పందంలో భాగంగా అమెరికా ఆంక్షలు ఎత్తివేయడం, ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం అంగీకరించినట్లు పేర్కొన్నారు.
తుది ఒప్పందంపై చర్చల కోసం 60 రోజుల గడువు ఉన్నట్లు ఆయన చెప్పారు. మరోవైపు అమెరికా తన యుద్ధ వైఖరిని మార్చుకోవాల్సిందేనని ఇరాన్ ప్రభుత్వ మీడియా వ్యాఖ్యానించింది. ఈ ఒప్పందం అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!