
జనరల్

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. జేవర్‌లో నిర్మిస్తున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు పెట్టే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే జాతీయ రాజధాని ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాలకు విమాన రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
ప్రతిపాదనకు అధికారిక ఆమోదం లభిస్తే విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టే అవకాశం ఉంది. అయితే, పేరు మార్పుపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!