
జనరల్

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ముత్తు యాదవ్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్‌కు సంబంధించిన వ్యవహారంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో అలసత్వం వహించడంతో పాటు, సుమంత్‌ను పట్టుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ముత్తు యాదవ్ మూడు వారాల క్రితమే జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!