
జనరల్

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ నెల 14 లేదా 15 తేదీల నాటికి రుతుపవనాలు అండమాన్ ప్రాంతాన్ని తాకే అవకాశం ఉంది. దీంతో సాధారణంగా కంటే ముందే వర్షాల ప్రభావం కనిపించవచ్చని అధికారులు చెబుతున్నారు.
మే నెలాఖరుకల్లా కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రుతుపవనాల ముందస్తు రాకతో కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. రైతులు కూడా ఈ పరిణామాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!