2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ అసెంబ్లీ సమావేశాలపై కీలక నిర్ణయం

Writer: Nithish 06:13 AM, 18 ఆగస్టు, 2026
ఏపీ అసెంబ్లీ సమావేశాలపై కీలక నిర్ణయం

శాసనసభ సమావేశాలను ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) నిర్ణయించింది. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన సోమవారం అసెంబ్లీలోని బీఏసీ మందిరంలో జరిగిన సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు పయ్యావుల కేశవ్‌, నాదెండ్ల మనోహర్‌, ప్రభుత్వ చీఫ్‌విప్‌ జీవీ ఆంజనేయులు, భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు హాజరయ్యారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్‌ కమిషన్‌ సమర్పించిన నివేదికను సభలో ప్రవేశపెట్టే అంశంపై చర్చ జరిగింది. మంగళవారం కేబినెట్‌లో నివేదికపై చర్చించిన అనంతరం సభలో ప్రవేశపెట్టడంపై నిర్ణయం తీసుకోవాలని భావించారు. ఈ సమావేశాల్లో మొత్తం 9 ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

శాసనమండలిలో మాత్రం సభా కార్యకలాపాలపై స్పష్టత రాలేదు. మండలి ఛైర్మన్‌ మోషేన్‌రాజు అధ్యక్షతన సోమవారం జరిగిన బీఏసీ సమావేశంలో అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. సాగునీరు, తాగునీటి సరఫరా, వ్యవసాయంపై ఎల్‌నినో ప్రభావం, వైకాపా హయాంలో గ్రూప్‌-1 నియామకాల్లో అక్రమాలు, మెగా డీఎస్సీ-2025 అంశాలపై చర్చించాలని మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రతిపాదించారు. అయితే ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మంగళవారమే డీఎస్సీపై చర్చించాలని పట్టుబట్టారు. ఇరు పక్షాలు తమ వైఖరిపై వెనక్కి తగ్గకపోవడంతో సమావేశం అర్ధంతరంగా ముగిసింది. దీంతో మంగళవారం ప్రశ్నోత్తరాల అనంతరం మరోసారి బీఏసీ సమావేశం నిర్వహించి సభా కార్యక్రమాలను ఖరారు చేయాలని నిర్ణయించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం..

ఫ్లై దుబాయ్ FZ1073 ఘటనలో ఇరాన్‌ ప్రమేయంపై ట్రంప్‌ అనుమానాలు..

ఫ్లై దుబాయ్ FZ1073 ఘటనలో ఇరాన్‌ ప్రమేయంపై ట్రంప్‌ అనుమానాలు..

బంగాళాఖాతంలో మరో వాయుగుండం..

బంగాళాఖాతంలో మరో వాయుగుండం..

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

నేడు కల్కి భగవాన్ మహాసమాధి కార్యక్రమం

నేడు కల్కి భగవాన్ మహాసమాధి కార్యక్రమం

గాంధీజీకి ఘన నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

గాంధీజీకి ఘన నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీఅసెంబ్లీ సమావేశాలుశాసనసభశాసనమండలిబీసీ రిజర్వేషన్లుచంద్రబాబుపయ్యావుల కేశవ్మెగా డీఎస్సీగ్రూప్-1 నియామకాలుఏపీ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం..
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం..

ఫ్లై దుబాయ్ FZ1073 ఘటనలో ఇరాన్‌ ప్రమేయంపై ట్రంప్‌ అనుమానాలు..
జనరల్

ఫ్లై దుబాయ్ FZ1073 ఘటనలో ఇరాన్‌ ప్రమేయంపై ట్రంప్‌ అనుమానాలు..

ఈసీ ఆఫీస్ ముందు కర్ణాటక సీఎం, మంత్రుల ఆందోళన...
రాజకీయాలు

ఈసీ ఆఫీస్ ముందు కర్ణాటక సీఎం, మంత్రుల ఆందోళన...

ఫౌజీకి మరో 60 పని దినాలు అవసరం.. విడుదల ఎప్పుడంటే?
గాసిప్స్

ఫౌజీకి మరో 60 పని దినాలు అవసరం.. విడుదల ఎప్పుడంటే?

సీనియర్ హీరోలు సొంతంగా కథలు ఎంచుకోరా?
గాసిప్స్

సీనియర్ హీరోలు సొంతంగా కథలు ఎంచుకోరా?

రాజమౌళి, సుకుమార్.. చందూకు ఆ ఛాన్స్ ఉందా?
గాసిప్స్

రాజమౌళి, సుకుమార్.. చందూకు ఆ ఛాన్స్ ఉందా?

ఆదర్శ కుటుంబం.. ఆ రూమర్లు నిజమేనా?
గాసిప్స్

ఆదర్శ కుటుంబం.. ఆ రూమర్లు నిజమేనా?

బాలయ్య అన్‌స్టాపబుల్‌ 5 ఎప్పుడొస్తుంది?
గాసిప్స్

బాలయ్య అన్‌స్టాపబుల్‌ 5 ఎప్పుడొస్తుంది?

విజయ్, రష్మిక.. తల్లిదండ్రులకు దూరంగా ఎందుకున్నట్టు?
గాసిప్స్

విజయ్, రష్మిక.. తల్లిదండ్రులకు దూరంగా ఎందుకున్నట్టు?

మంగ్లీకి పోటీగా ప్రభ.. ఎవరీ సింగర్?
సినిమాలు

మంగ్లీకి పోటీగా ప్రభ.. ఎవరీ సింగర్?

సినిమా టీవీలోకి రావాలన్నా సెన్సార్ తప్పదా?
సినిమాలు

సినిమా టీవీలోకి రావాలన్నా సెన్సార్ తప్పదా?

100 కోట్ల హీరోకి ఇంత గ్యాప్ ఎందుకు?
గాసిప్స్

100 కోట్ల హీరోకి ఇంత గ్యాప్ ఎందుకు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!