
సినిమాలు

తమిళనాడులో సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ‘అన్నపూర్ణి సూపర్ సిక్స్’ పథకం కింద అర్హత కలిగిన కుటుంబాలకు ఏడాదికి ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు అందించే ప్రతిపాదనతో పాటు, మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని విస్తరించే చర్యలను ప్రభుత్వం ప్రకటించింది.
ఇప్పటికే సాధారణ ప్రభుత్వ బస్సుల్లో మహిళలు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లో ఉంది. దీన్ని మరిన్ని సర్వీసులకు విస్తరించే ప్రతిపాదనలు ఉన్నాయి. విజయ్ ఎన్నికల హామీల్లో ‘వెట్రి పయణం’ కింద అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ‘అన్నపూర్ణి సూపర్ సిక్స్’ కింద కుటుంబానికి ఏడాదికి ఆరు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు అందిస్తామని ప్రకటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!