

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం కింద తొలి విడతగా 64.76 లక్షల మంది అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జూలై 22న నిధులు జమ చేసింది. ఒకటో తరగతిలో కొత్తగా చేరిన విద్యార్థులు, ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు పొందిన వారు, రికార్డుల్లో సవరణలు అవసరమైన కేసులు కలిపి మరో 2.7 లక్షల మందికి రెండో దశలో నిధులు అందించాల్సి ఉంది. వీరికి ఆగస్టు 30న నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం షెడ్యూల్ చేసినప్పటికీ, అనుకున్న ప్రకారం చెల్లింపులు జరగలేదని సమాచారం. దీంతో సుమారు మూడు లక్షల మంది లబ్ధిదారులు నిధుల కోసం ఎదురుచూస్తున్నారు.
రెండో విడత నిధులకు సంబంధించిన ఫైలుకు ఆర్థిక శాఖ ఆమోదం లభించినట్లు సమాచారం. తుది ఆమోదం కోసం ఫైలును ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి అనుమతి లభించిన తర్వాత నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ పథకం కింద అర్హులైన విద్యార్థికి ఏడాదికి రూ.15,000 ఆర్థిక సహాయం అందుతుంది. అందులో రూ.13,000 తల్లి లేదా సంరక్షకుడి ఖాతాలో జమ చేస్తారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!