
సినిమాలు

భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ బ్రాండ్ విలువ భారీగా పెరిగింది. గ్లోబల్ రిస్క్ మరియు ఫైనాన్షియల్ అడ్వైజరీ సంస్థ క్రోల్ విడుదల చేసిన తాజా వార్షిక ర్యాంకింగ్స్ ప్రకారం, కోహ్లీ 231.1 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,900 నుంచి రూ.2,100 కోట్లు) విలువతో దేశంలోనే అత్యంత విలువైన సెలబ్రిటీగా అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. సోషల్ మీడియాలో ఉన్న విపరీతమైన ఫాలోయింగ్, ప్రముఖ బ్రాండ్ల ఎండార్స్‌మెంట్లు ఆయన బ్రాండ్ పవర్‌ను మరింత బలపరిచాయి.
ఈ విలువతో కోహ్లీ, రణవీర్ సింగ్, షారుక్ ఖాన్ వంటి సినీ తారలను మించి నిలిచారు. ప్రపంచ స్థాయిలో క్రీడలు, లైఫ్‌స్టైల్ మార్కెట్లను కలిపే బ్రాండ్‌గా ఆయన ఎదిగారు. ముంబై లేదా లండన్‌లో నివాసం గురించి చర్చలు జరుగుతున్నా, కోహ్లీ గ్లోబల్ బ్రాండ్‌గా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!