
సినిమాలు

సింగరేణి కాలరీస్‌లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సింగరేణి నుంచి సుమారు 40 లక్షల టన్నుల బొగ్గు, దాదాపు రూ.1,600 కోట్ల విలువైనది మాయమైందని మీడియాలో కథనాలు వచ్చినట్లు ఆయన ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
సంస్థ భద్రతను కఠినతరం చేయాలని, ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్‌లను సమీక్షించాలని సూచించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి రూ.51,500 కోట్లకు పైగా బకాయి ఉందని పేర్కొంటూ ఆర్థిక ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. 40 వేల మందికి పైగా కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమం కాపాడటంతో పాటు సంస్థ పారదర్శకత, విశ్వసనీయతను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!