
టెక్నాలజీ

తెలంగాణలో ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటివరకు 3,06,21,142 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా, 90.52 శాతం పంపిణీ పూర్తయింది. అయితే కేవలం 26,38,708 ఫారాలే డిజిటైజేషన్ చేయబడి, ఇది 7.80 శాతంగా ఉంది. నిర్మల్ జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 100 శాతం పంపిణీ పూర్తయింది.
డిజిటైజేషన్ విషయంలో జిల్లాల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 34.88 శాతం అత్యధికంగా ఉండగా, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 27.91 శాతం, నల్గొండ జిల్లాలో 23.44 శాతం, ఖమ్మం జిల్లాలో 20.90 శాతం నమోదైంది. కాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లాల్లో డిజిటైజేషన్ శాతం చాలా తక్కువగా ఉంది. హైదరాబాద్‌లో 47,36,669 మంది ఓటర్లు ఉండగా 71.14 శాతం పంపిణీ పూర్తయింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!