
టెక్నాలజీ

అఖిల్ అక్కినేని నటిస్తున్న 'లెనిన్' చిత్రం నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్ర ప్రారంభంలో వచ్చే శ్రీరామపురం, భారతం మిట్ట ప్రపంచాన్ని తన గంభీరమైన గళంతో ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. "నమ్మకంతో పుట్టిన ప్రపంచానికి... ప్రత్యేక స్వరం" అంటూ మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడించడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
మురళి కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, తమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. నాగార్జున అక్కినేని, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజెస్ LLP నిర్మిస్తున్న ఈ చిత్రం జులై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చిత్ర ప్రమోషన్స్‌కు మరింత క్రేజ్ తీసుకొచ్చింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!