

లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ఫెండి (ఫెండి)కి చెందిన ఓ రంగురంగుల బ్యాగ్ ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ‘నవరాత్రి బ్యాగ్’గా సోషల్ మీడియాలో పిలుస్తున్న ఈ బ్యాగ్ ధర సుమారు రూ.8.3 లక్షలుగా ప్రచారం కావడంతో పాటు, గుజరాత్‌లో నవరాత్రి సమయంలో కనిపించే సంప్రదాయ రంగురంగుల బ్యాగుల డిజైన్‌ను పోలి ఉందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ బ్యాగ్‌లో ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్, బీడ్స్ వంటి అలంకరణలు ఉన్నాయి. అయితే, ఫెండి అధికారిక ఉత్పత్తి వివరణలో భారతీయ కళా సంప్రదాయానికి సంబంధించిన స్పష్టమైన ప్రస్తావన లేదంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అంశంపై పారిశ్రామికవేత్త హర్ష్ గొయెంకా, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా స్పందించారు. గుజరాత్ వీధుల్లో లభించే సంప్రదాయ బ్యాగ్ డిజైన్‌తో పోల్చుతూ ఫెండి ఉత్పత్తికి భారీ ధర నిర్ణయించడంపై హర్ష్ గొయెంకా ప్రశ్నలు లేవనెత్తారు. భారతీయ కళాకారులకు తగిన గుర్తింపు దక్కడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. భారతీయ సంప్రదాయ కళను లగ్జరీ ఉత్పత్తిగా ప్యాకేజింగ్ చేసి విక్రయిస్తున్నారని, దానిని పరిరక్షించిన కళాకారులకు గుర్తింపు అవసరమని కిరణ్ మజుందార్-షా పేర్కొన్నారు. అయితే, కొన్ని రిపోర్టుల ప్రకారం ఈ బ్యాగ్‌ను ముంబైలోని చాణక్య వర్క్‌షాప్‌లో భారతీయ కళాకారుల సహకారంతో తయారు చేసినట్లు కూడా వెల్లడైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!