

సినిమా విడుదలైన తర్వాత కథ, కథనం, నటీనటుల నటనపై విమర్శలు రావడం సాధారణమే. అయితే తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలైన ‘రోమాంచకం’పై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఆయన సినీ విమర్శకులను ఉద్దేశించి స్పందిస్తూ చిన్న సినిమాలను సులభంగా టార్గెట్ చేయడం ఎందుకని ప్రశ్నించారు. చేతనైతే ‘స్పిరిట్’ను టార్గెట్ చేయాలని సవాల్ విసిరారు.
సినిమా నిర్మాణంలోకి వస్తేనే చిత్రాన్ని రూపొందించడం ఎంత కష్టమో అర్థమవుతుందని ప్రణయ్ వంగా అన్నారు. ముఖ్యంగా “చేతనైతే ‘స్పిరిట్’ను అటాక్ చేయండి సినిమా విడుదలయ్యాక చూద్దాం” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రణయ్ వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.
‘స్పిరిట్’లో ప్రభాస్ శక్తివంతమైన పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. నేరం, యాక్షన్, భావోద్వేగాలతో కూడిన కథను సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ వస్తుందని ఇప్పటికే సందీప్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా 2027 మార్చి 5న విడుదలకు షెడ్యూల్ అయింది. ‘రోమాంచకం’పై వచ్చిన విమర్శలకు ‘స్పిరిట్’తో సమాధానం ఇస్తామంటూ ప్రణయ్ వంగా చేసిన సవాల్ ఇప్పుడు సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!