

రాజమహేంద్రవరంలో ఆంధ్రా పేపర్ లిమిటెడ్‌పై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2016 తర్వాత కాతేరు గ్రామ పంచాయతీ లేదా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌కు కంపెనీ ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించలేదని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు సుమారు రూ.21.34 కోట్ల పన్ను బకాయిలు ఉన్నాయని తెలిపారు. పన్ను చెల్లింపుల కోసం నోటీసులు ఇచ్చిన ప్రతిసారీ కోర్టులను ఆశ్రయిస్తూ కాలయాపన చేయడం సరికాదని ప్రశ్నించారు.
అదే సమయంలో పరిశ్రమ నుంచి వెలువడుతున్న ద్రవ వ్యర్థాలపై కూడా పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ నుంచి వెలువడే వ్యర్థాల్లో కొన్ని కాలుష్య కారకాలు నిర్దేశిత ప్రమాణాలను మించి ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని తెలిపారు. గోదావరి పర్యావరణ వ్యవస్థ, జలచరాలు, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చి, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కంపెనీ ప్రతినిధులతో చర్చించినప్పటికీ తగిన స్పందన రాలేదని పేర్కొన్నారు. దీంతో నిబంధనల ప్రకారం ఆంధ్రా పేపర్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి కేసుల్లో న్యాయ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచిస్తూ, స్వచ్ఛ గోదావరి–పవిత్ర పుష్కరాల కార్యక్రమానికి పర్యావరణవేత్తలు, పౌర సమాజం మద్దతు ఇవ్వాలని కోరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!