

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఒకే ఆధార్ నంబర్‌ను ఉపయోగించి వేర్వేరు పేర్లతో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ, రెండు శాఖల నుంచి జీతాలు పొందుతున్నట్లు ఆర్థిక శాఖ గుర్తించింది. రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, వైద్య, విద్య తదితర శాఖల్లో సుమారు 80 మంది డూప్లికేట్ ఉద్యోగులు ఉన్నట్లు 40 అనుమానాస్పద కేసుల్లో గుర్తించినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల ఆధార్ వివరాలను పరిశీలించే క్రమంలో ఈ వ్యవహారం బయటపడింది. కొన్ని సందర్భాల్లో ఒకే ఆధార్ నంబర్‌పై వేర్వేరు లింగాలు, పేర్లు, ఇతర భిన్న వివరాలతో ఉద్యోగులుగా నమోదైనట్లు అధికారులు గుర్తించారు.
ప్రజారోగ్య శాఖలో డి.ప్రమీల రాణి, కె.ప్రమీల పేర్లతో, విద్యాశాఖలో కిందింటి మోహన్ రెడ్డి, బసి రెడ్డి మోహన్ రెడ్డి పేర్లతో ఒకే ఆధార్ నంబర్‌పై ఉద్యోగాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. అలాగే సహకార, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖల్లోనూ ఇలాంటి కేసులు బయటపడినట్లు తెలుస్తోంది. ఒక్కో డూప్లికేట్ ఉద్యోగి మార్చి, ఏప్రిల్, మే నెలల్లోనే సుమారు రూ.5 లక్షల వరకు జీతం పొందినట్లు ప్రాథమిక పరిశీలనలో తేలడంతో చీఫ్ సెక్రటరీ విచారణకు ఆదేశించినట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!