

ఆంధ్రప్రదేశ్‌ను ప్రముఖ షిప్‌బిల్డింగ్, మెరైన్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా కీలక ముందడుగు పడింది. దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పాటుకు మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL)తో ఏపీ ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సచివాలయంలో ఎండీఎల్, నేషనల్ షిప్‌బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్–ఏపీ (NSHIP-AP) మధ్య ఎంవోయూ జరిగింది. ఈ ప్రాజెక్టు కోసం వచ్చే ఐదేళ్లలో ఎండీఎల్ సుమారు రూ.15,000 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 45 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతిపాదిత షిప్‌యార్డ్‌కు ఏడాదికి 12 లక్షల గ్రాస్ టన్నుల నౌకల నిర్మాణ సామర్థ్యం ఉండనుంది.
దుగరాజపట్నంలో షిప్‌బిల్డింగ్–కమ్–పోర్ట్ క్లస్టర్‌ను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. టెక్నో–ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ప్రకారం షిప్‌బిల్డింగ్, షిప్ రిపేర్ యార్డ్‌కు సుమారు రూ.29,254 కోట్లు, పోర్టు అభివృద్ధికి సుమారు రూ.9,513 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ట్యాంకర్లు, బల్క్ క్యారియర్లు, కంటైనర్ నౌకలు, ఎల్‌ఎన్‌జీ క్యారియర్లు, ఇతర భారీ ప్రత్యేక నౌకలను నిర్మించేలా షిప్‌యార్డ్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మాజ్రి–నాందేడ్ మార్గానికి ప్రత్యక్ష అనుసంధానం ఏర్పడటంతో పాటు బల్హార్షా–నాగ్‌పూర్ హై-డెన్సిటీ మార్గంపై భారం తగ్గనుంది. మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047, కేంద్ర ప్రభుత్వ షిప్‌బిల్డింగ్ డెవలప్‌మెంట్ స్కీం లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు అభివృద్ధి కానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!