
సినిమాలు

శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లోని లోక్ భవన్లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో యోగా అంతర్గత ప్రశాంతత, క్రమశిక్షణ, సానుకూల శక్తిని అందిస్తుందని పేర్కొన్నారు.
యోగ భారతీయ ప్రాచీన సంప్రదాయానికి ప్రతీకగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందిస్తోందని గవర్నర్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచ గుర్తింపు తీసుకురావడంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!