
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశం ప్రారంభం కాగా, ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశం జరగనుంది. మొత్తం నాలుగు రోజుల పాటు సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది.
సభలో చర్చించాల్సిన అంశాలు, సమావేశాల పనిదినాలపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు ఈసారి కూడా వైసీపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ చర్చలు ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!