

అయోధ్య రామ మందిర ప్రసాదం పేరుతో సాధారణ స్వీట్లను విక్రయించిన వ్యవహారంలో ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌కు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సీసీపీఏ) జరిమానా విధించినట్లు సమాచారం. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అనుమతి లేకుండా “శ్రీ రామ్ మందిర్ అయోధ్య ప్రసాద్” పేరుతో స్వీట్లను విక్రయానికి ఉంచినందుకు అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై రూ.1 లక్ష జరిమానా విధించి, 15 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించినట్లు పేర్కొనబడింది.
చందు ట్రేడింగ్ కంపెనీకి చెందిన ‘బిహార్ బ్రదర్స్’ బ్రాండ్ కింద నెయ్యి లడ్డూలు, ఖోయా లడ్డూలు, బూందీ లడ్డూలు, ఆవు పాల స్వీట్లను రామ మందిర ప్రసాదంగా అమెజాన్‌లో విక్రయించినట్లు సమాచారం. దీనిపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) 2024 జనవరిలో చేసిన ఫిర్యాదును సీసీపీఏ పరిశీలించింది. ట్రస్ట్ అనుమతి లేకుండా ప్రసాదం పేరును వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం వినియోగదారులను తప్పుదోవ పట్టించడమే కాకుండా భక్తుల మతపరమైన భావాలను దెబ్బతీసే చర్యగా అథారిటీ పేర్కొన్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!