

2026–27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ అడ్మిషన్ల కన్వీనర్ కోటా రెండో విడత సీట్ల కేటాయింపును కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (KNRUHS) మంగళవారం విడుదల చేసింది. కాలేజీల వారీగా సీట్ల కేటాయింపు వివరాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. రెండో విడతలో సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 19 సాయంత్రం 4 గంటల్లోగా సంబంధిత కాలేజీల్లో చేరాలి. అడ్మిషన్ సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు, బాండ్లు, ఇతర అవసరమైన పత్రాలను సమర్పించాలి.
అదేవిధంగా మేనేజ్‌మెంట్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల మొదటి విడత సీట్ల కేటాయింపును కూడా KNRUHS విడుదల చేసింది. ఈ కేటగిరీలో సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 19 సాయంత్రం 6 గంటల్లోగా తమకు కేటాయించిన కాలేజీల్లో చేరి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు, బాండ్లు, ఇతర అవసరమైన పత్రాలను సమర్పించాలని యూనివర్సిటీ సూచించింది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ షెడ్యూల్ ప్రకారం 2026–27 ఎంబీబీఎస్, బీడీఎస్ అకడమిక్ సెషన్ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమైందని తెలిపింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!