
సినిమాలు

వనపర్తి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. పార్టీకి, తనకు వ్యతిరేకంగా చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మేఘారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
చిన్నారెడ్డి వ్యవహారశైలిపై ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసినట్లు మేఘారెడ్డి వెల్లడించారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని గతంలోనే ప్రకటించిన ఆయన, తాజాగా కేసీ వేణుగోపాల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వనపర్తి కాంగ్రెస్‌లో ఇరువురు నేతల మధ్య విభేదాలు మరింత రాజకీయ చర్చకు దారితీశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!