

బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో భూ వ్యవహారాలు, రెవెన్యూ శాఖలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై పలు ఆరోపణలు చేసిన ఆయన.. తన ఆరోపణలపై ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత భూములను నిషేధిత జాబితాలో ఎలా చేరుస్తారని ప్రశ్నించారు.
పేదలను భయపెట్టి వారి భూములను లాక్కుంటున్నారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. భూ బదలాయింపులపై సీబీఐ విచారణకు ఆదేశించే ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలపైనా ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపించిన మహేశ్వర్ రెడ్డి.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!