

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 నాలుగో ఎపిసోడ్ ఆసక్తికరమైన టాస్కులు, జడ్జీల ప్రశ్నలతో సాగింది. మొదటి కంటెస్టెంట్‌గా వచ్చిన లక్ష్మీ దీపక్ సేనాపతి తన జీవిత ప్రయాణాన్ని వివరించాడు. క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని, అయితే ఆరోగ్య సమస్యల కారణంగా ఆ ఆటను వదిలి యాక్టింగ్, మోడలింగ్ వైపు వచ్చినట్లు చెప్పాడు. ఈ సమయంలో నవదీప్ అతనికి ట్రిమ్మర్ ఇవ్వడంతో అసలు పరీక్ష మొదలైంది. అప్లికేషన్‌లో రాసిన సమాధానాలకు, స్టేజ్‌పై చెప్పిన మాటలకు తేడా ఉండటాన్ని జడ్జీలు గుర్తించారు. బిందు మాధవి రెడ్ ఇవ్వగా.. జ్యూరీని మానిప్యులేట్ చేయాలని చూశాడా అని ప్రశ్నించారు. చివరకు తాను కావాలనే అలా చేశానని దీపక్ ఒప్పుకున్నాడు. అనంతరం స్టేజ్‌పైనే గడ్డం, మీసం తీసేశాడు. అయినప్పటికీ అతడిని హోల్డ్‌లో ఉంచారు.
ఆ తర్వాత అపూర్వ తన యాంకరింగ్, ప్రెజెంటేషన్‌తో ఆకట్టుకుంది. అయితే లింగ సమానత్వం, చదువుపై ఆమె చేసిన వ్యాఖ్యలతో జడ్జీలతో చర్చ జరిగింది. రోహిత్ నాయుడిని పరిస్థితులకు ఎలా స్పందిస్తాడో, అవసరమైనప్పుడు తన స్టాండ్ తీసుకుంటాడో తెలుసుకునేందుకు జడ్జీలు పరీక్షించారు. గౌతం రాజు, రమ్య, ఐశ్వర్య, శ్రీరాం, సిక్కోలు సీమన్, సాక్షిత తదితరులు కూడా హోల్డ్‌లోకి వెళ్లారు. గౌరి త్రినేత్ర తన వ్యక్తిగత ప్రయాణాన్ని, ట్రాన్స్‌జెండర్ మహిళగా ఎదుర్కొన్న సవాళ్లను వివరించింది. ఇక నెల్లూరు నుంచి వచ్చిన భాగి తుల్లూరు తన అమాయకమైన మాటతీరు, హాస్యం, భావోద్వేగ కథతో జడ్జీలను ఆకట్టుకుంది. కొందరు జడ్జీలు గ్రీన్ ఇచ్చినా.. మరింతగా తన సత్తా నిరూపించుకోవాలని భావించి ఆమెను కూడా హోల్డ్‌లో ఉంచారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!