

తమిళ స్టార్ విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సిగ్మా’. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న ఈ యాక్షన్, అడ్వెంచర్, ట్రెజర్ హంట్ హేస్ట్ థ్రిల్లర్‌ను లైకా ప్రొడక్షన్స్‌పై సుబాస్కరన్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. జూలై 31న విడుదల కావాల్సిన ఈ చిత్రం.. విజయ్ నటించిన ‘జన నాయగన్’ జూలై 23న విడుదల కానున్న నేపథ్యంలో వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సినిమా విడుదలపై పలు రూమర్లు వినిపించాయి.
తాజాగా ఆ ఊహాగానాలకు తెరదించుతూ ‘సిగ్మా’ విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. అక్టోబర్ 2న జరగబోయే భారీ దోపిడీకి సిద్ధంగా ఉండాలంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జత చేసింది. ఈ సందర్భంగా విడుదల చేసిన సందీప్ కిషన్ కొత్త పోస్టర్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!