

చెత్తగా భావించే ప్లాస్టిక్ బాటిళ్లతోనే ఓ కళాకారుడు ఏకంగా తేలియాడే దీవిని నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బ్రిటిష్ కళాకారుడు రిచార్ట్ సోవా మెక్సికోలో ‘జాయ్‌క్సీ ఐలాండ్’ పేరుతో ఈ వినూత్న దీవిని రూపొందించారు. ఇందుకోసం 1 లక్షకు పైగా ఉపయోగించిన ప్లాస్టిక్ బాటిళ్లను వినియోగించారు. ఇది కేవలం తేలియాడే తెప్పలా కాకుండా, ఇల్లు, చెరువులు, జలపాతం వంటి సౌకర్యాలతో కూడిన ప్రత్యేక నివాస ప్రదేశంగా రూపొందించబడింది.
ఈ తేలియాడే దీవిలో పర్యావరణహిత సౌర విద్యుత్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. సాధారణ ప్లాస్టిక్ వ్యర్థాలను సృజనాత్మకంగా ఉపయోగించి స్వయం సమృద్ధిగా ఉండే తేలియాడే నివాసాన్ని నిర్మించడం ద్వారా రిచార్ట్ సోవా పునర్వినియోగం, పర్యావరణ పరిరక్షణకు కొత్త అర్థాన్ని చూపించారు. వ్యర్థ పదార్థాలను కూడా వినూత్న ఆలోచనతో ఉపయోగిస్తే పర్యావరణహిత నిర్మాణాలకు ఎలా రూపం ఇవ్వవచ్చో ఈ దీవి చాటిచెబుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!