10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హర్మూజ్‌లో మళ్లీ కలకలం..

Writer: Chandrika 12:25 PM, 10 ఆగస్టు, 2026
హర్మూజ్‌లో మళ్లీ కలకలం..

వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. అబుదాబి నేషనల్‌ ఆయిల్‌ కంపెనీ (ADNOC)కు చెందిన ఓ నౌకపై క్షిపణి దాడి జరిగినట్లు ఆ సంస్థ ధ్రువీకరించింది. జలసంధి గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపింది. దాడి అనంతరం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చామని, ఎవరూ గాయపడలేదని పేర్కొంది. అంతకుముందు ఇరాన్‌ మీడియా దక్షిణ హర్మూజ్‌ ప్రాంతంలో ఓ చమురు ట్యాంకర్‌గా భావిస్తున్న నౌకలో మంటలు చెలరేగినట్లు వెల్లడించింది. అయితే మంటలకు కారణం, నౌకకు జరిగిన నష్టం వంటి పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు.

ఇదిలా ఉండగా, ప్రాంతీయ ఉద్రిక్తతలు సౌదీ అరేబియాకూ విస్తరించాయి. ఇరాన్‌ మద్దతున్న యెమెన్‌ హూతీలు సౌదీ అరేబియాలోని ఆరామ్‌కోకు చెందిన జాజన్‌ రిఫైనరీపై డ్రోన్‌ దాడి చేసినట్లు ప్రకటించారు. ఈ ఘటనలో రిఫైనరీలో మంటలు చెలరేగినట్లు సౌదీ ఇంధన శాఖ ధ్రువీకరించింది. అయితే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. హర్మూజ్‌లో నౌకా రవాణా భద్రతపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ ఈ వరుస ఘటనలు చోటుచేసుకోవడం గల్ఫ్‌ ప్రాంతంలో పరిస్థితుల తీవ్రతను చాటుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...

ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్

కర్నూలు హత్యల వెనుక వైసీపీ హస్తం - మంత్రి భరత్

కర్నూలు హత్యల వెనుక వైసీపీ హస్తం - మంత్రి భరత్

ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

హోటల్‌ ఫ్రీ వైఫైతో జాగ్రత్త - మైక్రోసాఫ్ట్‌ హెచ్చరిక

హోటల్‌ ఫ్రీ వైఫైతో జాగ్రత్త - మైక్రోసాఫ్ట్‌ హెచ్చరిక

ట్యాగ్లు
హర్మూజ్‌ జలసంధిఇరాన్‌చమురు ట్యాంకర్‌క్షిపణి దాడిADNOCసౌదీ అరేబియాహూతీలుజాజన్‌ రిఫైనరీఆరామ్‌కోమధ్యప్రాచ్య ఉద్రిక్తతలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...
జనరల్

ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...

మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..
సినిమాలు

మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..

టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?
గాసిప్స్

టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్
రాజకీయాలు

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..
క్రీడలు

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్
సినిమాలు

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..
క్రీడలు

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి
జనరల్

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు
రాజకీయాలు

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్
జనరల్

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్

హర్మూజ్‌లో మళ్లీ కలకలం..
జనరల్

హర్మూజ్‌లో మళ్లీ కలకలం..

వీకెండ్‌లోనే బ్రేక్‌ఈవెన్‌ దాటిన ‘కొరియన్‌ కనకరాజు’..
సినిమాలు

వీకెండ్‌లోనే బ్రేక్‌ఈవెన్‌ దాటిన ‘కొరియన్‌ కనకరాజు’..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!