
జనరల్

అగ్రిగోల్డ్ కేసులో మరిన్ని ఆస్తుల జప్తునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 9.87 ఎకరాల భూమిని జప్తు చేసేందుకు ఏపీ హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని పోరంకి, పెనమలూరు, ఈదర ప్రాంతాల్లో ఉన్న 6.55 ఎకరాలు, కర్ణాటకలోని ఆనేకల్‌లో ఉన్న 3.32 ఎకరాల భూమి ఉన్నాయి.
అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారుల నుంచి సేకరించిన సొమ్ముతోనే ఈ భూములను కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఆస్తుల జప్తునకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం సీఐడీ డీజీని ఆదేశించింది. డిపాజిట్‌దారుల ప్రయోజనాలను కాపాడే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!