

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన భారత నావికుడు రాకేశ్ చౌహాన్ వెనెజువెలాలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం పలు అనుమానాలకు తావిచ్చింది. మృతదేహం భారత్‌కు చేరుకున్న అనంతరం కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో స్థానిక అధికారుల పర్యవేక్షణలో రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. ఆ పరీక్షలో మెదడు, గుండె, ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీలు వంటి కీలక అంతర్గత అవయవాలు లేకపోవడం వెలుగులోకి వచ్చినట్లు ఫెడరేషన్ ఆఫ్ సీఫేరర్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (FSUI) వెల్లడించింది.
మృతదేహాన్ని భారత్‌కు పంపే ముందు వెనెజువెలా అధికారులు పోస్టుమార్టం నివేదిక లేదా మరణానికి సంబంధించిన పూర్తి వివరాలను కుటుంబానికి అందించలేదని ఎఫ్‌ఎస్‌యూఐ తెలిపింది. ఫోరెన్సిక్ పరీక్షకు అవసరమైన కీలక అవయవాలు లేకపోవడంతో మరణానికి అసలు కారణాన్ని నిర్ధారించడం కష్టమైందని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పారదర్శక విచారణ చేపట్టాలని, వెనెజువెలాలోని భారత రాయబార కార్యాలయం మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని ఎఫ్‌ఎస్‌యూఐ విజ్ఞప్తి చేసింది. అలాగే మృతుడి కుటుంబానికి తగిన పరిహారం అందించాలని కోరింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!