
జనరల్

ప్రజారోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని నాగాలాండ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గుట్కా, పాన్ మసాలా తయారీ, నిల్వ, పంపిణీ, విక్రయం మరియు సరఫరాపై పూర్తి నిషేధం విధించింది. ఈ ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యానికి తీవ్ర హానికరమని ప్రభుత్వం పేర్కొంది.
ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం గుట్కా, పాన్ మసాలాలో పొగాకు, నికోటిన్ వంటి ఆరోగ్యానికి ప్రమాదకరమైన పదార్థాలు ఉంటాయి. వీటి వినియోగం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా యువత ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!