

విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ‘పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్లెన్స్’ నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు మాట్లాడుతూ, రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ అంతర్జాతీయ స్థాయి క్రీడా కేంద్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ సాకారం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఈ అకాడమీలో ఏడు ప్రధాన క్రీడా విభాగాలతో పాటు ఆధునిక శిక్షణా సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. 25 మీటర్ల ఇండోర్ షూటింగ్ రేంజ్, ఒలింపిక్స్లో ఉపయోగించే ఇటలీకి చెందిన మిర్తా పూల్స్ ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయి స్విమ్మింగ్ పూల్ నిర్మించనున్నారు. విశాఖ పర్యటనలో మంత్రి లోకేశ్ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించి, అనంతరం ఐబీఎం ఫ్యూచర్ నౌ సెంటర్ను ప్రారంభించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!