

రష్యా సైన్యంలో చేరిన భారతీయుల పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం తాజా వివరాలను వెల్లడించింది. రష్యా సాయుధ దళాల్లో మొత్తం 227 మంది భారతీయులు చేరినట్లు సమాచారం ఉందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. వారిలో 139 మందిని సైన్యం నుంచి డిశ్చార్జ్ చేసినట్లు, 51 మంది మరణించినట్లు ఆయన వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ కిర్గిజిస్థాన్ పర్యటన నేపథ్యంలో జరిగిన మీడియా బ్రీఫింగ్‌లో మిశ్రీ ఈ వివరాలను వెల్లడించారు.
మిగిలిన భారతీయులను కూడా రష్యా సైన్యం నుంచి త్వరగా విడుదల చేసి స్వదేశానికి తీసుకురావడానికి మాస్కోతో భారత్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని మిశ్రీ తెలిపారు. ఈ అంశాన్ని భారత్-రష్యా మధ్య వివిధ స్థాయిల్లో పలుమార్లు ప్రస్తావించినట్లు చెప్పారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయుల పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ, వారి డిశ్చార్జ్, స్వదేశానికి తరలింపు కోసం రష్యా అధికారులతో సమన్వయం చేస్తోందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!