

నీట్ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం నిన్న పార్లమెంట్‌ను పూర్తిగా స్తంభింపజేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు లోక్‌సభ, రాజ్యసభల్లో తీవ్ర ఆందోళనలు చేపట్టాయి. నీట్ పేపర్ లీక్, కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు, అయోధ్య హుండీ చోరీ ఘటనలపై వెంటనే చర్చించాలని డిమాండ్ చేస్తూ సభ్యులు ప్లకార్డులతో నినాదాలు చేయడంతో సభలు సజావుగా సాగలేదు.
లోక్‌సభ ఆరు సార్లు వాయిదా పడిన అనంతరం రోజంతా సమావేశాలు నిలిచిపోయాయి. కొందరు ప్రతిపక్ష సభ్యులను సభలోకి రానివ్వలేదని ఆరోపణలు కూడా వినిపించాయి. ఇదే సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కు పెంచే ఆర్డినెన్స్‌కు బదులుగా బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు.
రాజ్యసభలో కూడా ప్రతిపక్షాల నిరసనలతో ఆరు సార్లు వాయిదా పడిన తర్వాత సమావేశాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నీట్ పేపర్ లీక్, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలను ప్రస్తావించారు. సభా వ్యవహారాల కమిటీ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని నిర్ణయించినప్పటికీ, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఈ వారం ఎజెండాలో లేవని స్పష్టమైంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!