

నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులు అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రశ్నాపత్రం లీక్ ఘటన కారణంగా రద్దైన పరీక్షను జూన్ 21న మళ్లీ నిర్వహించనున్న నేపథ్యంలో జూన్ 14న అడ్మిట్ కార్డులు విడుదల చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. అయితే సాంకేతిక సమస్యలు, సర్వర్ లోపాల కారణంగా పలువురు అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోలేకపోతున్నారు.
దేశవ్యాప్తంగా 23 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరుకానుండగా ఇప్పటివరకు కేవలం నాలుగు లక్షల మంది మాత్రమే అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. సమస్యల పరిష్కారానికి సాంకేతిక బృందాలు పనిచేస్తున్నాయని, ప్రత్యామ్నాయ లింక్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. మరోవైపు ఫీజు రీఫండ్ కోసం బ్యాంకు వివరాల ధ్రువీకరణ తప్పనిసరి చేయడం వల్ల మరింత గందరగోళం నెలకొందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!