

విజయ్ ఆంటోనీ నటించిన ‘వంద దేవుళ్లు’ సినిమా థియేటర్లలో ప్రదర్శన ముగిసిన తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. శశి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూన్ 19న విడుదలై మిశ్రమ స్పందనను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చిన కథతో పాటు సమాజానికి ఇచ్చిన సందేశం ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఆగస్టు 7 నుంచి జీ5 వేదికగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
భర్తను కోల్పోయిన వాసవి తన ఇద్దరు కుమారులను ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ పెంచుతుంది. సమాజం నుంచి ఎదురయ్యే విమర్శలు, కుటుంబ పరిస్థితుల మధ్య జీవితాన్ని కొనసాగించిన ఆమె, 42 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ నిర్ణయం కుటుంబ సభ్యులు, బంధువులు, సమాజంలో ఎలాంటి పరిణామాలకు దారితీసింది? యేడుకొండలు పాత్రలో విజయ్ ఆంటోనీ ప్రవేశించిన తర్వాత ఆమె జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి? అనే అంశాలతో ఈ చిత్రం భావోద్వేగంగా సాగుతుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!