
జనరల్

దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ కార్యక్రమంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక మైలురాయిని సాధించింది. ఇప్పటివరకు 2 కోట్లకు పైగా విద్యార్థుల బయోమెట్రిక్ వివరాలను విజయవంతంగా అప్‌డేట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆధార్ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచేందుకు ఈ కార్యక్రమం కీలకంగా మారింది.
ఈ కార్యక్రమాన్ని UDISE+తో అనుసంధానం చేయడంతో పాఠశాలల్లో విద్యార్థుల Mandatory Biometric Update (MBU) స్థితిని సులభంగా గుర్తించే అవకాశం ఏర్పడింది. 2025 సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పటివరకు 1.56 లక్షల పాఠశాలల్లో అప్‌డేట్ శిబిరాలను నిర్వహించారు. దీంతో విద్యార్థులకు ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ సేవలు వేగంగా, సులభంగా అందుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!