

భారత్, జపాన్ మధ్య 75 ఏళ్ల దౌత్య సంబంధాలకు గుర్తుగా టీమిండియా సెప్టెంబర్ 22న జపాన్‌తో ప్రత్యేక టీ20 మ్యాచ్ ఆడనుంది. టోచిగిలోని సానో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ‘సుజుకి కప్’ పేరుతో ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇరు దేశాల మధ్య క్రీడా సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజల మధ్య పరస్పర సంబంధాలను పెంచే లక్ష్యంతో చేపట్టిన ‘స్పోర్ట్ 75’ కార్యక్రమంలో భాగంగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధ్రువీకరించింది.
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ మ్యాచ్‌ను భారత క్రికెట్‌కు కీలక ఘట్టంగా అభివర్ణించారు. టీమిండియా కొత్త ప్రాంతంలో ఆడటంతో పాటు జపాన్, తూర్పు ఆసియాలోని ప్రేక్షకులకు క్రికెట్‌ను మరింత చేరువ చేసే అవకాశం లభిస్తుందని తెలిపారు. జపాన్ క్రికెట్ అసోసియేషన్ సీఈవో నావోకీ మియాజీ కూడా ఈ మ్యాచ్‌పై ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ ఛాంపియన్ భారత జట్టు జపాన్‌లో ఆడటం చారిత్రక సందర్భమని, దీనివల్ల అక్కడ క్రికెట్‌పై ఆసక్తి మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!