

రాష్ట్రంలో ఏ ఒక్క చిన్నారీ కూడా చదువుకు దూరం కాకూడదనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. 'తల్లికి వందనం' పథకం నిధుల విడుదల సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ, పిల్లలే రాష్ట్రానికి నిజమైన సంపద, వారి విద్యే భవిష్యత్తుకు అత్యంత విలువైన పెట్టుబడని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఈరోజు నుంచి నిధులు జమ చేయనున్నట్లు తెలిపారు.
ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నా అందరికీ ఎలాంటి పరిమితులు లేకుండా పథకం వర్తించేలా ప్రభుత్వం రూపకల్పన చేసిందని లోకేశ్ చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో 67.47 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారని, 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.10,120.78 కోట్లు జమ చేయనున్నట్లు వెల్లడించారు. నిధుల బదిలీ ప్రక్రియ ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగుతుందని, పిల్లలను చదివించే ప్రతి తల్లికి తన వందనాలు తెలియజేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!