
జనరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జే ట్రంప్‌ను ఆయన విమర్శకుడు హంటర్ బైడెన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినట్లు ఎక్స్ వేదికగా వ్యంగ్యంగా ప్రకటించారు. “చరిత్రలో ఏ అధ్యక్షుడు ఒకే యుద్ధాన్ని పలు మార్లు ఆపలేదు. ట్రంప్ మాత్రం ఇరాన్‌తో యుద్ధాన్ని 38 సార్లు ఆపారని సీఎన్‌ఎన్ గణాంకాలు చెబుతున్నాయి” అంటూ ఆయన విమర్శించారు. ట్రంప్ తరచూ ఉపయోగించే శైలిలోనే “ఈ విషయంపై దృష్టి పెట్టినందుకు ధన్యవాదాలు” అంటూ తన పోస్టును ముగించడం గమనార్హం.
గతంలో జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్, హంటర్ బైడెన్‌పై తరచూ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హంటర్ చేసిన తాజా పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికా అధ్యక్షుల్లో ఇప్పటివరకు వుడ్రో విల్సన్ మరియు బరాక్ ఒబామా మాత్రమే నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!