
జనరల్

ఉత్తర కొరియా రాజ్యాంగంలో 54 ఏళ్ల తర్వాత కీలక మార్పులు చేసినట్లు సమాచారం. తాజా సవరణల్లో భాగంగా దేశ అణ్వాయుధాల నియంత్రణ బాధ్యతలను స్టేట్ అఫైర్స్ కమిషన్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. అలాగే దక్షిణ కొరియాను ప్రధాన శత్రువుగా కాకుండా పొరుగు దేశంగా గుర్తించేలా రాజ్యాంగ వైఖరిలో మార్పులు చేసినట్లు సమాచారం.
పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, క్యాబినెట్‌పై కిమ్ జోంగ్ ఉన్ తన అధికారాలను మరింత బలోపేతం చేసుకున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అమెరికా నుంచి ఎదురయ్యే ముప్పుపై ఆందోళనలు, ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సవరణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బాహ్య ముప్పులను ఎదుర్కొనేందుకు దేశ పాలనా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసుకోవడమే ఈ మార్పుల వెనుక ఉన్న ఉద్దేశంగా కనిపిస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!