

ప్రపంచవ్యాప్తంగా రాగి తవ్వకం, శుద్ధి సామర్థ్యాల మధ్య పెరుగుతున్న అసమతుల్యతతో సరఫరా ఒత్తిళ్లు పెరిగాయి. దీంతో లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ (ఎల్‌ఎంఈ)లో రాగి ధర టన్నుకు 14,737 డాలర్లకు (సుమారు రూ.14 లక్షలు) చేరింది. గతేడాది సెప్టెంబరుతో పోలిస్తే ఇది 50 శాతం అధికం. అమెరికా సుంకాలు విధించే అవకాశాలు, గనుల నుంచి సరఫరా తగ్గడం, ప్రపంచ నిల్వల్లో మార్పులు ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని ఇండియన్ ప్రైమరీ కాపర్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ (ఐపీసీపీఏ) తెలిపింది.
కామెక్స్, ఎల్‌ఎంఈ మార్కెట్ల మధ్య ధరల వ్యత్యాసాన్ని ఉపయోగించుకునేందుకు ఈ ఏడాది ప్రారంభం నుంచి భారీగా రాగిని అమెరికాకు తరలించినట్లు ఐపీసీపీఏ పేర్కొంది. కామెక్స్ నిల్వలు రికార్డు స్థాయిలో 6.75 లక్షల టన్నులకు చేరగా.. ఎల్‌ఎంఈ గిడ్డంగుల్లో నిల్వలు అత్యల్ప స్థాయికి పడిపోయాయి. దీంతో ఇతర మార్కెట్లలో రాగి లభ్యత తగ్గి ధరలపై మరింత ఒత్తిడి పెరిగిందని తెలిపింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!