

పాకిస్థాన్‌కు చెందిన 28 ఏళ్ల టిక్‌టాక్ క్రియేటర్ షామ్సో బీబీ, ఆన్‌లైన్‌లో ‘ఆయేషా గిల్మానా’గా గుర్తింపు పొందిన ఆమె, ఆగస్టు 14న ఇస్లామాబాద్ సమీపంలోని ట్యాక్సిలాలో కాల్పుల్లో హత్యకు గురయ్యారు. తన సోదరి, సోదరుడితో కలిసి కారులో వెళ్తుండగా బైక్‌పై వచ్చిన దుండగులు వాహనాన్ని అడ్డుకుని కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. బీబీ మెడకు బుల్లెట్లు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆమెకు టిక్‌టాక్‌లో 13 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఘటనకు ముందు తనకు బెదిరింపులు వస్తున్నాయని కుటుంబ సభ్యులకు చెప్పినట్లు ఆమె తండ్రి తెలిపారు.
పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున జరిగిన ఈ హత్య కేసులో పోలీసులు నలుగురు అనుమానితులను అరెస్ట్ చేసినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ప్రధాన నిందితుడికి పరారీలో సహకరించిన ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. షామ్సో బీబీ గత మూడు నాలుగేళ్లుగా టిక్‌టాక్ వీడియోలు చేస్తూ గుర్తింపు పొందారు. ఆమెకు కొందరితో ఆర్థిక వివాదాలు ఉన్నాయని, డబ్బుల విషయంలో బెదిరింపులు ఎదుర్కొన్నారని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే హత్యకు కారణం, నిందితుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!