
జనరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం కేరళకు వెళ్లనున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజానికి రొటేటర్ కఫ్ గాయంతో శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన, వైద్యుల సూచన మేరకు తదుపరి చికిత్సలో భాగంగా కేరళలో ప్రత్యేక ఆయుర్వేద థెరపీ తీసుకోనున్నారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని, కొంతకాలం బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు.
అయితే పాలనా బాధ్యతల దృష్ట్యా వారం రోజుల్లోనే పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయానికి అందుబాటులోకి వచ్చారు. ముందుగా ఖరారైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు శాఖాపరమైన సమీక్షలు, పార్టీ అంతర్గత సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలో శస్త్రచికిత్స చేసిన భుజంలో వాపు పెరగడంతో పాటు తీవ్ర జ్వరం రావడంతో, వైద్యుల సూచన మేరకు పూర్తి విశ్రాంతి తీసుకుంటూ కేరళలో ఆయుర్వేద చికిత్స పొందనున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!