
జనరల్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటి నుంచి ఆరు రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో అధికారిక పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న ఆయన, భారతీయ స్టార్టప్‌లు, డీప్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, అభివృద్ధి చెందుతున్న రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించనున్నారు. ఈ పర్యటనతో భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ద్వైపాక్షిక సమావేశాలతో పాటు ప్రధాని మోదీ 52వ జీ7 సదస్సులో కూడా పాల్గొననున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక పురోగతి, అంతర్జాతీయ భద్రత, భౌగోళిక రాజకీయాల వంటి కీలక అంశాలపై ప్రపంచ నేతలు చర్చించనున్న ఈ సదస్సు ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ అంతర్జాతీయ భాగస్వామ్యాలను విస్తరించడంలో ఈ పర్యటన కీలకంగా మారనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!