

పార్లమెంట్‌లో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం విద్యా సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన హైపవర్ టాస్క్‌ఫోర్స్ కమిటీలో సభ్యుడైన ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటిని ఉద్దేశిస్తూ ఆమె “గోమూత్ర నిపుణుడు” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర రాజకీయ వాదోపవాదాలకు దారితీశాయి.
ప్రొఫెసర్ కామకోటి 2025 జనవరిలో చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో గోమూత్రానికి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలపై జరిగిన కొన్ని శాస్త్రీయ పరిశోధనలను ప్రస్తావించారు. ఈ అంశంపై పీర్-రివ్యూడ్ శాస్త్రీయ జర్నల్స్‌లో ప్రచురితమైన ఐదు అధ్యయనాలను కూడా ఆయన సూచించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన గత వ్యాఖ్యలు, తాజాగా పార్లమెంట్‌లో ప్రస్తావనకు రావడంతో ప్రొఫెసర్ కామకోటి మరోసారి వార్తల్లో నిలిచారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!