
సినిమాలు

ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో భేటీ అయ్యారు. ఈ ఏడాది మొత్తం 82 మంది ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులు అందనున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రవర్తనపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మోదీ సూచించారు. యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వ్యసనంపై అప్రమత్తంగా ఉండాలని, పిల్లల్లో అధిక స్క్రీన్ టైమ్‌ను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
క్రీడలు, సృజనాత్మక కార్యకలాపాలకు విద్యార్థులు ప్రాధాన్యం ఇచ్చేలా ప్రోత్సహించాలని మోదీ సూచించారు. తల్లిదండ్రులతో కలిసి పిల్లల మొబైల్ వినియోగాన్ని తగ్గించేలా చూడాలని చెప్పారు. జాతీయ విద్యా విధానం (NEP) ప్రకారం విద్యార్థులకు వాస్తవ జీవితంలో ఉపయోగపడే నైపుణ్యాలను బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!